Skip to main content

Namaste NRI

అమీర్ లోగ్ నుండి అవ్వల్ దావత్ సాంగ్ విడుదల

ఎంసీ హరి, వేద జలంధర్‌, మనోజ్‌, శశిధర్‌ ప్రధానపాత్రలు పోషించిన విభిన్న కథాచిత్రం అమీర్‌ లోగ్‌. రమణారెడ్డి సోమ దర్శకుడు. మాధవిరెడ్డి సోమ నిర్మాత. స్పిరిట్‌ మీడియా సంస్ధ ద్వారా రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో ఈ సినిమాలోని అవ్వల్‌ దావత్‌ సాంగ్‌ని మేకర్స్‌ విడుదల చేశారు.

హైదరాబాదీల మంచి మనసుల్ని తెరపై ఆవిష్కరించాలనే ఉద్దేశంతో తయారు చేసుకున్న కథ అమీర్‌ లోగ్‌. శ్రేయోభిలాషులకు సినిమా చూపిస్తే అభినందించారు. డబ్బున్నవారు అమీర్‌ లోగా? సంతోషంగా ఉండేవారు అమీర్‌ లోగా? అన్నది ఈ చిత్రం చూసిన వారికి అర్థమవుతుంది. ఈ సినిమా చూశాక హైదరాబాద్‌ మనుషులపై ప్రేమ, గౌరవం మరింత పెరుగుతుంది అని దర్శకుడు రమణారెడ్డి చెప్పారు. ఇంకా నిర్మాత మాధవిరెడ్డి, సంగీత దర్శకుడు స్మరణ్‌సాయి, నటి వేద జలంధర్‌, నటులు ఎంసీ హరి, మనోజ్‌ తదితరులు మాట్లాడారు. ఆగస్ట్‌ 21న సినిమా విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events