Namaste NRI

శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న బాబూ  జగజ్జీవన్‌ రామ్‌

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్‌రామ్‌ జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రం బాబూ జగజ్జీవన్‌రామ్‌. మిలటరీ ప్రసాద్‌ టైటిల్‌రోల్‌ చేస్తున్నారు. దిలీప్‌రాజా స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా విశేషాలను తెలిపేందుకు హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మహనీయుడు బాబూ జగజ్జీవన్‌రామ్‌ గురించి భావితరాలకు తెలియాలనే ఈ సినిమా తీస్తున్నాను.

రెండు షెడ్యూల్స్‌ పూర్తయ్యాయి. బాబూ జగజ్జీవన్‌రామ్‌ వర్ధంతి రోజైన జూలై 6న సినిమాను విడుదల చేస్తాం. ఇందులో గాంధీజీ, నేతాజీ, లాల్‌ బహద్దూర్‌ శాస్త్రి, చంద్రశేఖర్‌ ఆజాద్‌ పాత్రలు కూడా ఉంటాయి. జగజ్జీవన్‌రామ్‌ కుమార్తె, లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ పాత్రలో తాళ్లూరి రామేశ్వరి నటిస్తున్నారు అని డైరెక్టర్‌ దిలీప్‌రాజా తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీకృష్ణ, హరిశ్రీనివాస్‌, సంగీతం: వినోద్‌ యాజమాన్య.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events