Namaste NRI

బచ్చల మల్లి వచ్చేస్తున్నాడు

అల్లరి నరేశ్  నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్‌ బచ్చలమల్లి. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రూరల్‌ యాక్షన్‌ డ్రామా గా తెరకెక్కుతోంది. మూవీ లవర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విడుదల తేదీపై మేకర్స్‌ క్లారిటీ ఇచ్చేశారు. ఈ చిత్రం క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా డిసెంబర్ 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్‌. అల్లరి నరేశ్ సిగరెట్‌ తాగుతూ సీరియస్‌ మూడ్‌లో ఉన్న స్టిల్‌ నెట్టింట వైరల్ అవుతోంది. బచ్చలమల్లి సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటా రనేది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీలో అమృతా అయ్యర్‌ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. హాస్యా మూవీస్ బ్యానర్‌పై రాజేశ్‌ దండా, బాలాజీ గుప్తా సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నాడు. రావు రమేశ్‌, హరితేజ, ప్రవీణ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events