Namaste NRI

కేరళలోని చీకటి యుగాల నేపథ్యం.. భ్రమయుగం

ప్రత్యేకంగా హారర్- థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడానికి నిర్మాత చక్రవర్తి రామచంద్ర స్థాపించిన నైట్ షిఫ్ట్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ని  ప్రారంభించారు. ప్రారంభ సమయంలోనే తాము నిర్మించబోయే మొదటి సినిమాని ఈ రోజే పక్రటిస్తున్నట్లు నిర్మా తలు తెలిపారు. చెప్పినట్లుగానే మొదటిచిత్రాన్ని ఘనంగా పక్రటించారు. నైట్ షిఫ్ట్ స్టూ డియోస్ నిర్మిస్తున్న మొదటి చిత్రం  భ్రమయుగంలో ప్రముఖ  నటుడు మమ్ము ట్టి నటిస్తున్నారు. రాహుల్ సదాశివన్ రచన-దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూ డియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో ఈ సినిమా ఉండ‌నుంది.  చిత్ర ప్రకటన సందర్భంగా ప్రముఖ నటుడు మమ్ముట్టి మాట్లాడుతూ ఒక ఉత్తేజకరమైన చిత్రం. నేను మునుపెన్నడూ పోషించని పాత్రను పోషిస్తున్నందున ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దర్శకుడు రాహుల్ అద్భుత ప్రతిభ, నిర్మాతలు రామ్-శశిల అభిరుచి ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకం చేశాయి అన్నారు.

ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్డా లిజ్ ఇతర ముఖ్య పాతల్రు పోషిస్తున్నా రు. సినిమాటోగ్రాఫర్ గా షెహనాద్ జలాల్, ప్రొడక్షన్ డిజైనర్ గా జోతిష్ శంకర్, ఎడిటర్గా షఫీక్ మహమ్మద్ అలీ, సంగీత దర్శకుడిగా క్రిస్రి్టో జేవియర్ వ్యవహరిస్తున్నా రు. టిడిరామకృష్ణన్ డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి మేకప్ రోనెక్స్ జేవియర్, కాస్ట్యూ మ్స్ మెల్వీ జె. నైట్ షిఫ్ట్ స్టూ డియోస్, వైనాట్ స్టూ డియోస్ సమర్పిస్తున్న భ్రమయుగం 2024 ప్రారంభంలో పప్రంచవ్యా ప్తంగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీభాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events