Namaste NRI

బడే మియాన్‌ చోటే మియాన్‌ టీజర్‌ అప్‌డేట్

 బాలీవుడ్‌ త్వరలో సందడి చేసేందుకు రెడీ అవుతున్న మల్టీస్టారర్‌ బడే మియాన్‌ చోటే మియాన్‌. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం. ఈ చిత్రాన్ని పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఆజ్‌ ఫిలింస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా నటిస్తున్నాడు.   ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్‌లు, గ్లింప్స్‌ అంచనాలు పెంచుతున్నాయి. తాజాగా ఈ బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ టీజర్‌ అప్‌డేట్ అందించారు మేకర్స్‌. బడే మియాన్‌ చోటే మియాన్‌కు సెన్సార్‌ బోర్డు (సీబీఎఫ్‌సీ) నేడు యూఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది.

తాజా అప్‌డేట్ ప్రకారం టీజర్ నిడివి 1.41 నిమిషాలు. టీజర్‌ను జనవరి చివరి వారంలో డిజిటల్‌గా లాంఛ్ చేయబోతున్నట్టు బీటౌన్‌ సర్కిల్ సమాచారం. ఈ చిత్రాన్ని ముందుగా క్రిస్మస్‌కు రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. కానీ షూటింగ్‌ పెండింగ్‌లో ఉండటం, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు కూడా ఎక్కువ సమయం అవసరం ఉండటంతో వాయిదా వేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నా రు.ఈ మూవీని హిందీతోపాటు అన్ని దక్షిణాది భాషల్లో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events