Skip to main content

Namaste NRI

బద్మాషులు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌  విడుదల

మహేష్‌ చింతల, విద్యాసాగర్‌, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ బద్మాషులు. శంకర్‌ చేగూరి దర్శకుడు. బి.బాలకృష్ణ, సి.రామశంకర్‌ నిర్మాతలు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘గ్రామీణ నేపథ్యంలో సాగే హాస్యభరిత చిత్రమిది. ప్రతి సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. ప్రతీ పాత్ర నిజజీవితంలో ఎక్కడో చూసినట్టే అనిపిస్తూ చక్కటి వినోదాన్ని పంచుతుంది. కథాపరంగా సందేశం కూడా ఉంటుంది అన్నారు. బలగం సుధాకర్‌ రెడ్డి, కవిత శ్రీరంగం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వినీత్‌ పబ్బతి, సంగీతం: తేజ కూనూరు, దర్శకత్వం: శంకర్‌ చేగూరి.

Social Share Spread Message

Latest News