నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వం. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ మరోసారి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా, శ్రీలీల కీ రోల్ పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్నాడు.
తాజాగా సెకండ్ సింగిల్ ఉయ్యాలో ఉయ్యాలా ను విడుదల చేశారు మేకర్స్. ఉయ్యాలో ఉయ్యాలా నా ఊపిరే నీకు ఉయ్యాలా.. అవుమల్లా అవుమల్లా గీ చేతుల్ల నిను మొయ్యాలా.. అంటూ తెలంగాణ ఫ్లేవర్‌తో బాలకృష్ణ, శ్రీలీల మధ్య సాగుతున్న పాట అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను ఎస్పీ చరణ్ పాడారు. భగవంత్ కేసరి అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.