ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన రాయల్ గోల్డ్ మెడల్ అవార్డును భవన నిర్మాణ రంగంలో భారత ఆర్కిటెక్ట్ బాలకృష్ణ దోశీ గెలుచుకొన్నారు. బాలకృష్ణ తన 70 ఏండ్ల కెరీర్లో 100కు పైగా ప్రఖ్యాత ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారని, భారతదేశంలో భవన నిర్మాణ రంగాన్ని ఎంతో ప్రభావితం చేశారని పేర్కొన్నది. భవన నిర్మాణ రంగానికి ఆయన జీవితాంతం చేసిన కృషికి గుర్తింపుగా 2022 సంవత్సరానికి గాను ఈ అవార్డును బ్రిటన్ రాణీ క్వీన్ ఎలిజబెత్`2 బాలకృష్ణకు ఇవ్వడానికి ఆమోదం తెలిపారు అని వెల్లడిరచింది. రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ (ఆర్ఐజీఏ) ఈ మేరకుకు ప్రకటన చేసింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)