నందమూరి బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ మొదలైంది. గోపీచంద్ మలినేని దర్శకుడు. వాస్తవ సంఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని కథను సిద్ధం చేసుకున్నారు. బాలకృష్ణ సరసన శ్రుతీ హాసన్ నటిస్తోంది. ఎస్బికే 107 అంటూ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి వివి వినాయక్ క్లాప్‌నిచ్చారు. బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి సన్నివేశానికి హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జనవరి నుంచి ప్రారంభమవుతుంది. మాస్ కథానాయకుడు, మాస్ నాడి తెలిసిన దర్శకుడు కలిసి చేస్తున్న సినిమా ఇది. ప్రేక్షకులకు కనులవిందుగా ఉంటుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా మంచి స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు దర్శకుడు. వాణిజ్య హంగులతో ఉన్నతమైన సాంకేతిక విలువలతో సినిమా రూపొందనుందని సినీ వర్గాలు తెలిపారు. కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబుసాన్ స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ కలిసి ఈ చిత్రానికి నిర్మాతలు. తమన్ సంగీతం అందిస్తుండగా, రిషి పంజాబీ కెమెరామోన్గా వ్యవహరిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది.














