టాలీవుడ్ సీనియర్ నటులు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్‌లు ఒకే చోట కలుసుకున్నారు. రామోజీ ఫిలిం సిటీ వేదికగా అనిల్ రావిపూడి – వెంకటేశ్ ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతుండగా, ఈ షూటింగ్ సెట్స్‌లో బాలయ్య వచ్చి సందడి చేశాడు. భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేశ్ స్టార్ అనిల్ రావిపూడి కాంబోలో ఈ మూవీ తెరకెక్కబోతుంది.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ చిత్రం కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానుంది. ఇప్పటికే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో ఉన్న దర్బార్ హాల్‌లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సెట్స్‌లో నందమూరి బాలకృష్ణ వచ్చి అందరికి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అనంతరం వెంకటేశ్, అనిల్ రావిపూడితో కలిసి ముచ్చటించాడు బాలయ్య.