నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించారు. ఫస్ట్ సింగిల్ జై బాలయ్యను నవంబర్ 25న విడుదల చేయనున్నారు. వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుక్ను బాలకృష్ణ ట్రాక్టర్ నడిపిస్తూ కనిపిస్తున్నాడు. రాజసం నీ ఇంటిపేరు అని పోస్టర్‌పై కనిపిస్తుంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నట్టు టాక్. రాయలసీమలో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో పవర్ ఫుల్ పక్కా మాస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతుంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. కన్నడ యాక్టర్ ధునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నారు. అవినాస్ మరో కీ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి మాటలు: సాయి మాధవ్ బుర్రా, కూర్పు : నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్ : ఎ.ఎస్.ప్రకాశ్, ఛాయాగ్రహణం : రిషి పంజాబీ.
