Namaste NRI

సింగపూర్‌లో అంగరంగ వైభవంగా.. బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలు

తెలుగు చలనచిత్ర రంగంలో అగ్రహీరో నందమూరి బాలకృష్ణ గారి సినీ ప్రస్థానంలో  50 ఏళ్లు పూర్తి చేసుకు న్న సందర్భంగా  సింగపూర్‌లోని ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అభిరుచులు ఫంక్షన్‌ హాల్‌లో సమావేశమైన 100 మందికి పైగా ఫ్యాన్స్‌ కేక్‌ కట్‌ చేసి వేడుకలు చేశారు. బాలయ్య సినీ కెరీర్‌ గురించి చర్చించుకున్నారు. ఆయా చిత్రాలతో తమకున్న అనుభవాలను పంచుకున్నారు. ఆయన కెరీర్‌ కీలక పాత్ర పోషించిన  ప్రముఖ సినీ దర్శకులు బోయపాటి శ్రీను, బి.గోపాల్‌, అనిల్‌ రావిపూడికి  అభినందనలు తెలిపారు.

పాతూరి రాంబాబు మాట్లాడుతూ కుటుంబ విలువలు, సామాజిక సేవ, కష్టపడి పనిచేసే స్వభావం. ఇలా ఎన్నో గొప్ప విలువలు బాలకృష్ణ సొంతమన్నారు. ఈ విలువలను నేటితరం యువత కూడా ఆచరించాలని కోరారు. బాలకృష్ణ ఆయురారోగ్యాలతో మరెన్నో అద్భుతమైన చిత్రాల్లో యాక్ట్‌ చేయాలని కోరుకుంటున్నామని ఆయన తోపాటు అభిమానులందరూ తెలిపారు. ఈ వేడుక రుచికరమైన తెలుగు విందుతో ముగిసింది.  

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బీమినేని వెంకట్‌, వెలగా బాలకృష్ణ, నాదెండ్ల మురళీ, గుడిపూడి మధు, అభిరుచులు రెస్టారెంట్‌ మేనేజ్‌మెంట్‌కి అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News