Namaste NRI

కర్నూల్‌లో బాలయ సందడి

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎన్‌బీకే 107 వర్కింగ్‌ టైటిల్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా శ్రుతిహాసన్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. నేటి నుంచి కర్నూల్‌ కొండారెడ్డి బురుజలో కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారు.  దునియా విజయ్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రధారి. బాలకృష్ణ ఈ చిత్రంలో రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తుండగా, రిషి పంజాబీ ఛాయాగ్రాహకుడు. నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌. సాయిమాధవ్‌ బుర్రా సంభాషణలు రచిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events