బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్లగా, నిర్మాత దిల్‌రాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు కే. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, కిలారు సతీష్, శిరీష్ సంయుక్తంగా దర్శకుడికి స్క్రిప్ట్ అందించారు. ఓ పోరాట ఘట్టంతో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తున్నట్లు చిత్ర బృందం స్పష్టత ఇచ్చింది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు వెంకట్ మాస్టర్ నేతృత్వం వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఓ భారీ సెట్‌ను సిద్ధం చేశారు. వినూత్నమైన మాస్ యాక్షన్ కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. బాలకృష్ణ సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కూర్పు : తమ్మిరాజు, ఛాయాగ్రహణం: సి.రామ్‌ప్రసాద్, ఫైట్స్: వి.వెంకట్, రచన`దర్శకత్వం: అనిల్ రావిపూడి.
