Namaste NRI

సింగపూర్‌లో ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు

నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన నందమూరి బాలకృష్ణ 65వ పుట్టినరోజు వేడుకలు సింగపూర్‌లో తెలుగుదేశం ఫోరమ్ సింగపూర్ ఆధ్వర్యం లో ఘనం గా నిర్వహించారు . బాలయ్య అభిమానులు, సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలు పాల్గొని వేడుకలను పండగలా జరుపుకున్నారు. సినీ రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా స్టార్‌ హీరో  గా రాణించిన బాలయ్య ఎన్నో హిట్‌ చిత్రాలు అందించారని అభిమానులు తెలిపారు. బసవతారకం ఆసుపత్రి  నడుపుతూ ఎందరో పేద, మధ్యతరగతి కుటుంబాలకు పునర్జన్మ అందిస్తున్నారని కొనియాడారు.  సినీ, రాజకీయ రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేశారని తెలిపారు. ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు పాల్గొని బాలయ్యబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Social Share Spread Message

Latest News