నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న నయా యాక్షన్ ఎంటర్టైనర్ దాదా.కాజల్ అగర్వాల్ కథానాయికగా. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో మంచు మనోజ్ కీలకపాత్రధారి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని తొలి పాట దాదా ధమాకాను మేకర్స్ విడుదల చేశారు.

పబ్ నేపథ్యంలో సాగే ఈ పాటలో బాలకృష్ణ, నర్గీస్ ఫక్రీ ఫుల్ ఎనర్జీతో కనిపించారు. బావలే బావలే బావలే.. ఇక్కడున్నోళ్లంత నాకు సొంత బావలే అంటూ రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను రజనిశ్రీ పూర్ణిమ ఆలపించారు. ఈ పాటలోని కొంత భాగాన్ని బాలకృష్ణ స్వయంగా పాడటం విశేషం. మాస్ బీట్తో, క్యాచీ రిథమ్స్‌తో ఫుల్ ఎనర్జిటిక్‌గా తమన్ ఈ పాటను స్వరపరిచారు. శేఖర్ మాస్టర్ నృత్యరీతుల్ని సమకూర్చారు. మాస్ ప్రేక్షకులు మెచ్చేలా ఈ పాట సాగింది. ఈ మాస్ ఎంటర్టైనర్ డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: అరవింద్ ఎస్ కశ్యప్.















