Namaste NRI

అమెరికా లో వీరసింహారెడ్డి ప్రీమియర్ షో ను పండుగలా నిర్వహించిన బాలయ్య అభిమానులు

అమెరికా లోని నార్త్ కెరొలినా రాష్ట్రం, షార్లెట్ నగరంలో బాలయ్య అభిమానులు పురుషోత్తం చౌదరి గుడే, ఠాగూర్ మల్లినేని, సచ్చింద్ర ఆవులపాటి, వెంకట్ సూర్యదేవర మరియు షార్లెట్ బాలయ్య అభిమానులఆధ్వర్యంలో వీరసింహారెడ్డి ప్రీమియర్ షో నిర్వహించి కేక్ కట్ చేసి ఒక పండుగ లాగా ప్రీమియర్ షో వీక్షించారు. ఈ సందర్బంగా పురుషోత్తం చౌదరి గుడే, ఠాగూర్ మల్లినేని, దేవరాజ్ మాట్లాడుతూ భారతదేశం RRR గోల్డెన్ గ్లోబ్ అవార్డును పండుగగా జరుపుకుంటోంది, ఈ ఫీట్ కోసం భారతీయుడిగా మనం గర్వపడాలి. తెలుగువారిగా మనం కొంత గర్వంగా భావించాలి కానీ అహంకారం కాదు. బాలయ్య అభిమానులు గా మేము రెండు తెలుగు సినిమాలు వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్స్ కావాలని కోరుకుంటున్నాము, తెలుగు ఖ్యాతి విశ్వ విఖ్యాతం అవుతున్న రోజుల్లో, దయ చేసి రాజకీయ లాభాల కోసం సమాజాన్ని విభజించవద్దు. ఒకరిద్దరు వ్యక్తులు అపరిపక్వతతో గొడవ పడితే అబద్ధాలు జోడించి తప్పుడు ప్రచారం చేయకండి. ఒకరిద్దరు వ్యక్తులు సమాజాన్ని ప్రతిబింబించరు. అందరీ అభిమానులు, అన్ని కులాలు మరియు అన్ని పార్టీల ప్రజలు USA లో మంచి సామరస్యంతో కలిసి జీవిస్తున్నారు అని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events