అగ్ర కథానాయకుడు బాలకృష్ణ ప్రస్తుతం 109వ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తు న్నారు. ఈ చిత్రానికి డాకు మహారాజ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శుక్రవారం జరిగిన వేడుకలో టీజర్‌ను విడుదల చేశారు. బాలకృష్ణ శైలి పవర్ఫుల్ యాక్షన్ అంశాలతో టీజర్ ఆకట్టుకుంది. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మ రాజుది. మరణాన్ని వణికించిన మహారాజుది అంటూ డాకు మహారాజ్ పాత్రలో బాలకృష్ణను పరిచయం చేసిన తీరు రోమాంచితంగా అనిపించింది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు బాబీ కొల్లి.
ఈ సినిమాలో బాలకృష్ణ ఎలాంటి డూప్‌లను ఉపయోగించకుండా రియల్ ఫైట్స్ చేశారని, ఆయన్ని మును పెన్నడూ చూడని విధంగా కొత్త పంథాలో ఆవిష్కరించే ప్రయత్నం చేశానని చెప్పారు. అభిమానులకు పండగలా ఉండే సినిమా ఇదని నిర్మాత సూర్యదేవర నాగవంశీ పేర్కొన్నారు. బాలకృష్ణతో తనకిది ఐదో చిత్రమని, మాస్ హంగులతో మెప్పిస్తుందని, మ్యూజిక్ గూజ్బంప్స్ తెప్పిస్తుందని సంగీత దర్శకుడు తమన్ తెలిపారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది.