Namaste NRI

అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం ఘనంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో అమ్మవారి కల్యాణం నిర్వహంచారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్త్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆలయ పరిసరాలు మొత్తం జనసంద్రంగా మారాయి.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ దంపతులు అమ్మవారి కల్యాణంలో పాల్గొన్న అనంతరం ఆలయం లోపల అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహంచారు.

అమ్మవారి కళ్యాణంలో టీఎస్‌ఎంఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, ఎంపీ కవిత, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇంచార్జి తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ దంపతులు, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, ఈవో అన్నపూర్ణ, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events