సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ జూలై 23,87,000 భారతీయ ఖాతాలను బ్యాన్ చేసింది. ఇందులో 14 లక్షలకుపైగా ఖాతాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే వాట్సాప్ నిషేధించినట్లు తెలిపింది. తప్పుడు సమాచారాన్ని అడ్డుకునేందుకు, సైబర్ ముప్పును నివారించేందుకు, ఎన్నికల సమగ్రత పరిరక్షణ వంటి అంశాల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్లు వాట్సాప్ పేర్కొంది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి, నిర్ణయం తీసుకుంటుంది. కేంద్రం తీసుకువచ్చిన ఐటీ చట్టానికి అనుగుణంగా నిబంధనలు పాటించిన యూజర్ల అకౌంట్లను నిషేధిస్తూ ఉంటారు. వాట్సాప్ వేదికగా వేధింపులు, హానికర ప్రవర్తనను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ సంస్థ పేర్కొంది.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇంత మొత్తంలో ఖాతాలను నిషేధించడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు గత జూన్‌లో 22లక్షకుపైగా భారతీయ ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. అంతకు ముందు మేలో 19లక్షలు, ఏప్రిల్‌లో 16లక్షలు, మార్చిలో 18.05 లక్షల ఖాతాలపై వాట్సాప్ చర్యలు చేపట్టింది.