జైద్ ఖాన్, సోనాల్ జంటగా నటిస్తున్న సినిమా బనారస్. సోనాల్ మోంటోరో కథానాయిక. ఈ చిత్రానికి జయతీర్థ దర్శకత్వం వహిస్తున్నారు. తిలక రాజ్ బల్లాల్ నిర్మాత. వారణాసి నేపథ్యంలో సాగే ఆహ్లాదకర ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. తెలుగులో నాంది సతీష్ వర్మ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో జైద్‌ఖాన్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు మాపై అభిమానం చూపిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇదొక మిస్టీరియస్, మెచ్యూర్డ్ లవ్‌స్టోరీ. యాక్షన్, కామెడీ, థ్రిల్ ఇలా అన్ని అంశాలుంటాయి. ఒక ప్రయోగం కూడా చేశాం. అది ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది అన్నారు. బలమైన కంటెంట్‌తో వస్తున్న సినిమాను తెలుగులో విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇప్పటికే ట్రైలర్‌కు మంచి ఆదరణ దక్కుతున్నది అని సతీష్ వర్మ అన్నారు. ప్రేక్షకులందరూ కనెక్ట్ అయ్యే పాత్రను ఇందులో చేశాను అన్నారు సోనాల్. నవంబరు 4న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానుంది. నాందీ సతీష్ వర్మ ఈ చిత్రిన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు.
