కర్ణాటక ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్ బనారస్ చిత్రంలో హీరోగా పరిచయమవుతున్నారు. బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకుడు. సోనాల్ మోంటెరో కథానాయిక. ఎన్‌కె ప్రొడక్షన్స్‌పై తిలకరాజ్ బల్లాల్ నిర్మించారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రమిది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అని యూనిట్ తెలిపింది. వినాయక చవితి సందర్భంగా విడుదల తేదీని ప్రకటించారు. నవంబర్ 4న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: అద్వైత గురుమూర్తి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వైబి.రెడ్డి.