నాగార్జున, నాగచైతన్య కథానాయకులుగా నటించిన బంగార్రాజు ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ బంగార్రాజు చిత్రంలో ప్రతి పాట ఓ వజ్రంలా ఉంటుంది. ఇది సూపర్ హిట్ ఆల్బబ్. లిరిక్ రైటర్స్ మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. తెలుగు భాష ఉన్నంతవరకు సాహిత్యం ఉంటుంది అని అన్నారు. అభిమానులందర్నీ ఇక్కడకు పిలవలేకపోయినందుకు క్షమించాలి అన్నారు. ఆటపాటలతో సందడిగా సాగిందీ వేడుక. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో విజయవంతమైన సోగ్గాడే చిన్నినాయనా కి కొనసాగింపుగా రూపొందిన చిత్రమిది. జీ స్టూడియోస్‌తో కలిసి నాగార్జున నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ స్వరకర్త. మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో నాగార్జున, నాగచైతన్య, అమల, కృతిశెట్టి, ఫరియా అబ్దుల్లా, సుమంత్, సుశాంత్‌తో పాటు సినీ బృందం పాల్గొంది.