సోగ్గాడే చిన్నినాయనా సినిమా సీక్వెల్ బంగార్రాజు చిత్రీకరణ ప్రారంభమైంది. కల్యాణ్ కృష్ణ దర్శకుడు కృతి శెట్టి నాయిక. అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా మొదలెట్టారు నాగ చైతన్య మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. నాగ్ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా, చైతూకీ జోడీగా కృతి శెట్టి కనిపించనుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ స్వరాలందిస్తున్నారు. పూజా కార్యక్రమంలో నాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టి, కల్యాణ్ కృష్ణతో పాటుగా అక్కినేని కుటుంబ సభ్యులు హాజరయ్యారు.