ప్రపంచ నంబర్ వన్ ఆప్లే బార్టీ సొంతగడ్డపై సత్తా చాటి సరికొత్త రికార్డు సృష్టించింది. మహిళ సింగిల్స్ వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ ఆష్లే బార్టీ. ఈ యేటి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకున్నది. మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్లో లోకల్ ప్లేయర్ బార్టీ 6`3, 7`6 స్కోర్‌తో కొలిన్స్‌పై గెలిచి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నది. తొలి సెట్‌లో అమెరికా ప్లేయర్ కొలిన్స్‌ను ఈజీగా కొట్టేసింది. ఆ సెట్‌లో బార్టీ ఇది నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటల్లో కొలిన్స్ ఓ బ్రేక్ పాయింట్ సాధించినా ఆ తర్వాత బార్టీ మాత్రం తమ గేమ్‌తో అమెరికన్ ప్లేయర్‌ను ముప్పుతిప్పలు పెట్టింది.
అయితే రెండవ సెట్ మాత్రం హోరాహోరీగా సాగింది. ఓ దశలో 1`5 తేడాతో వెనుకబడ్డ బార్టీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్నది. తన ట్యాలెంట్‌ను ఆసీస్ ప్రేక్షకుల ముందు ప్రదర్శించింది. వరుస బ్రేక్ పాయింట్లతో కొలిన్స్ దూకుడుకు కళ్లెం వేసింది. ఇక 5`5తో మ్యాచ్‌లో నిలిచి ఆ తర్వాత టై బ్రేకర్‌లో సత్తా చాటింది. రెండవ సెట్‌ను 7`6 తేడాతో బార్టీ కైవసం చేసుకున్నది. ఈ విజయంతో 44 ఏళ్ల తర్వాత మహిళల సింగిల్స్‌లో మళ్లీ ఆస్ట్రేలియా ప్లేయర్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ దక్కింది. 1978లో చివరిసారి ఆస్ట్రేలియా ప్లేయర్ క్రిస్టినా ఓనీల్ టైటిల్ గెలిచింది. ట్రోఫీని సాధించాలనే కొలిన్స్ ఆశలపై బార్టీ నీళ్లు చల్లింది. రెండో సెట్‌లో కొలిన్స్ అద్భుతంగా రాణించినా ఫలితం లేకుండా పోయింది. అ సాధారణ పోరాట పటిమను కనబరిచిన ఆస్ట్రేలియా సంచలనం బార్టీ చాంపియన్‌గా అవతరించింది.