![](https://namastenri.net/wp-content/uploads/2024/11/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-5.jpg)
సతీష్‌బాబు రాటకొండ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం జాతర. రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మాతలు. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ రాశాను. చిత్తూరు జిల్లాలోని ఓ జాతర నేపథ్యంలో కథ నడుస్తుంది. ఆ గ్రామం కట్టుబాట్లు, ఆచారవ్యవహారాలను ఆవిష్కరిస్తూ ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. ఇంటెన్స్ విలేజ్ డ్రామాగా మెప్పిస్తుంది అన్నారు. గ్రామీణ నేపథ్యంలో వినూత్న మైన కథ ఇదని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమాలో అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించానని కథానాయిక దీయా రాజ్ చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/11/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-5.jpg)