
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం కిల్లర్ ఆర్టిస్టు. రతన్‌రిషి దర్శకత్వం. ఈ చిత్రాన్ని జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. నైజాంలో మైత్రీమూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తున్నది. ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. హత్య చేయడాన్ని ఓ కళగా భావించే వ్యక్తి కథ ఇదని, యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నానని, రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించామని, ఈ సినిమాలో హత్యా ప్రవృత్తిని గ్లోరిఫై చేయలేదని దర్శకుడు తెలిపారు. సరికొత్త కాన్సెప్ట్‌తో తీసిన రొమాంటిక్ థ్రిల్లర్ ఇదని నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని హీరో సంతోష్ కల్వచెర్ల చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ చిత్రం ఈ నెల 21న విడుదలకానుంది.
