Namaste NRI

సల్మాన్‌ ఖాన్‌ చిత్రంలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్  నటించిన చిత్రం  కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌. ఫర్హాద్‌ సమ్‌జీ దర్శకత్వం.   ఈ మూవీలో సల్మాన్ సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కథానాయిక నటిస్తోంది. ఈ సినిమాలో తెలంగాణ సంస్కృతిలో భాగమైన, ఆడబిడ్డల మనసుకు దగ్గరైన బతుకమ్మ పండుగ నేపథ్యంలో పాటను రూపొందించారు. తాజాగా కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌ సినిమాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో   పాటను మేకర్స్ విడుదల చేశారు. అందులో భలే ముద్దు ముద్దుగా పూజా హెగ్డే నృత్యం చేశారు. తెలంగాణ పల్లె సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా పాటను చిత్రీకరించారు. లంగా వోణి వేసి, కొప్పులో మల్లెపూలు పెట్టి, మెడ నిండా నగలతో బతుకమ్మ పాటలో పూజా హెగ్డే తెలంగాణ పడుచులా పూజా హెగ్డే నృత్యం చేస్తుంటే అలా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్, సల్మాన్ ఖాన్ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించడం ఈ పాట ప్రత్యేకత.

ఈ సినిమా తమిళంలో సూపర్‌ హిట్టయిన వీరమ్‌ కు రీమేక్‌గా తెరకెక్కుతుంది. తెలుగులో వీరుడొక్కడే పేరుతో డబ్బింగ్ అయింది. సల్మాన్‌ ఖాన్‌ తన సొంత బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. జగపతిబాబు, వెంకీ  కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌, పాటలు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్‌ చేశాయి. ఈద్ సందర్భంగా ఏప్రిల్‌ 4న ఈ మూవీ రిలీజ్‌ కానుంది.  ఈ సినిమాకు దేవి ప్రసాద్‌, రవి బస్రూర్‌, హిమేశ్ రేషమ్మియా సంగీత దర్శలుగా వ్యవహరిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events