ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA ) ఆధ్వర్యంలో అమెరికాలో బతుకమ్మ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకలకు ప్రముఖ యాంకర్ ఉదయభాను హాజరు కానున్నారు. ఉమెన్ ఎంపవర్ తెలుగు అసోసియేషన్ స్థాపించినప్పటి నుంచి ఏటా తెలంగాణ సంస్కృతి, సంప్రదాదాయలకు ప్రతీకగా భావించే బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 25 నుంచి మూడు నగరాల్లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 25న వాషింగ్టన్ డీసీ, వర్జీనియా.. అక్టోబర్ 1న శాన్ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలోని సాన్ రమోన్ నగరం, అక్టోబర్ 2న న్యూజెర్సీలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంటట్ రaాన్సీరెడ్డి హనుమాండ్ల, అడ్వైజరీ కౌన్సిల్ కో`చైర్ డాక్టర్ అభితేజ కొండా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరితో పాటు కోర్ కమిటీ సభ్యులు కోరారు. ఉత్సవాల్లో బతుకమ్మ ప్రాశస్త్యం, విశిష్టత, సంబరాల సంస్కృతిని తెలియజేస్తూ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. మహిళా శక్తి స్వరూపిణిగా చెప్పే ఈ దసరా నవరాత్రి రోజులలో వచ్చే సంబరాల్లో బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్న విషయం తెలిసిందే.