తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశ రాజధాని కానెబెర్రాలో పార్లమెంట్ ముందు నిర్వహించిన ఈ సంబరాల్లో మహిళలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలతో తరలివచ్చారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా బతుకమ్మ ఆడిపాడారు. దక్షిణ భారతదేశం తరపున ఓ పండుగను ఆస్ట్రేలియా పార్లమెంట్లో నిర్వహించిన ఘనత తెలుగువారికి దక్కినట్లు నిర్వాహకులు తెలిపారు. బతుకమ్మ పండుగ సంస్కృతి, విశిష్టతను తెలియజేడమే ధ్వేయంగా ఈ వేడుకులు నిర్వహించామని, భారీ స్పందన వచ్చిందని ఏసీటీ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు మనో పాల్గొని తన పాటలతో అలరించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)