Namaste NRI

మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌  ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలను

మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (మాటా) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. న్యూజెర్సీలోని ప్రతిష్ఠాత్మక రాయల్‌ ఆల్బర్ట్స్‌ ప్యాలెస్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మాటా సభ్యులు ఆవిష్కరించిన 21 అడుగుల బతుకమ్మ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలో స్థానిక నృత్య పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు  ఏర్పాటు చేశారు. మాటా స్టాండిరగ్‌ కమిటీ సభ్యుడు శేషగిరిరావు రాసిన స్వరపరిచిన సరికొత్త బతుకమ్మ పాటను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. మాటా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్‌ గనగోని, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కిరణ్‌ దుద్గగి, డాక్టర్‌ లింగ, శ్రీనివాస్‌రావు సహకారంతో ఈ పాటను రూపొందించారు.   మాటా పాటను శ్రీనివాస్‌ గనగోని ఆవిష్కరించిన అనంతరం సాయివేద వాగ్దేవి బతుకమ్మ పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

బతుకమ్మలను అందంగా పేర్చడంలో మంజుల గానగోని, శిరీష అరుంధతి  షకేలి, జ్యోతి కృష్ణ, రాధిక మడుపోజు, పద్మిని దుద్దగి, లతిత మాడిశెట్టి, నిత తదితరులు పాలుపంచున్నారు.  వేడుకను ఆహ్లాదంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.  ఈ కార్యక్రమంలో శ్రీధర్‌ గూడాల, మల్లిక్‌ రావు బొల్లా, నిఖితతో సహా మాటా పీఏ టీమ్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ వేడుక ఘనంగా జరగడానికి సహకరించిన సలహాదారులు వెంకటేష్‌ ముత్యాల, దాము గేదలను ఈ సందర్భంగా సత్కరించారు.  ఈ వేడుకల్లో దాదాపు 2000 మంది పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు ఇలాంటి వేడుకలు నిర్వహించే మాటా భవిష్యత్‌ కార్యక్రమాల కోసం www.mata-us.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి శ్రీనివాస్‌ గనగోని, కిరణ్‌ దుద్దగి, స్వాతి అట్లూరి, విజయ్‌ భాస్కర్‌ కలాల్‌, ప్రవీణ్‌ గూడూరు, మహేందర్‌ నరాల, వేణు గోపాల్‌ గిరి, రంగారావు, శిరీషా గుండపనేని, వెంకీ ముస్తీ తదితరులతో కూడిన మాటా కోర్‌ టీమ్‌ నాయకత్వం వహించింది. మల్లిక్‌ రెడ్డి, కృష్ణ సిద్ధాడ, గోపి పుట్కూరి, రఘు మోడుపోజు, రఘురామ్‌ రెండుచింతల, గిరిజా మాదాసి, దీపక్‌ కట్ట, రాకేష్‌ కస్తూరి, నరేందర్‌ రెడ్డి, మహేష్‌ చల్లూరి చైతు మద్దూరి తదితరులు సహకారం అందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events