
తెలంగాణ ఆత్మగౌరవానికి, మహిళల ఐక్యతకు బతుకమ్మ ప్రతీక అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మసంబరాల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వైభవం, ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు. పర్యాటకం, ఫిల్మ్ టూరిజం, ఆతిథ్య రంగాల్లో తెలంగాణ స్విట్జర్లాండ్ మధ్య పరస్పర సహకారానికి విస్తృత అవకాశాలు ఉన్నాయి అని పేర్కొన్నారు.















