Namaste NRI

జపాన్‌ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబురాలు

జపాన్‌ తెలుగు సమాఖ్య (జెటిఎస్) ఆధ్వర్యంలో  ఆ దేశ రాజధాని టోక్యోలోని కొమత్సుగవా పార్కులో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబురాలు జరుపుకుంది. తెలుగు ప్రజలంతా సంప్రదాయ వస్త్రాలు ధరించి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. మహిళలు పట్టుచీరలు ధరించి, బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పాడుకు న్నారు. రంగురంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలు ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఉత్సవాల్లో 200 మంది పాల్గొన్నారు.  జపాన్ తెలుగు సమాఖ్య స్వచ్ఛంద సేవా సిద్ధాంతాలతో వర్ధిల్లుతు న్నది. బతుకమ్మ లాంటి ఉత్సవాల నిర్వహణను కొనసాగించడంలో నిర్వాహకుల నడుమ సహకార స్ఫూర్తిని పెంపొందిస్తున్నది. జపాన్‌ తెలుగు సమాజం ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఈ విలక్షణమైన వేడుక.. దాని గత, ప్రస్తుత నిర్వాహకులకు గౌరవకరమైనదే కాదు, వారి అచంచలమైన అభిమానానికి ప్రతీక. నిర్మాణాత్మక ఫ్రేమ్‌వర్క్ లేకుండానే తాము ఈ విజయవంతమైన ఈవెంట్‌లను నిర్వహించగలుగు తున్నామని జపాన్ తెలుగు సమాఖ్య వాలంటీర్ మురళీధర్ అన్నారు.

బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగానే జపాన్ తెలుగు సమాఖ్య వన భోజనాల కార్యక్రమం నిర్వహించింది. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా రోజంతా ఆటపాటలతో ఎంజాయ్‌ చేశారు. టోక్యో నగరంలోని కొమత్సుగావా పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో రుచికరమైన భోజనాలు ఆస్వాదించారు. దాదాపు 150 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events