ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ఎన్నారైలు 30 మంది కలిసి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలంతా కలిసి బతుకమ్మ, దాండియా ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. ఈ సందర్భంగా పిల్లలకు బతుకమ్మ పండుగ ప్రాశస్త్యం వివరించారు. దుర్గామాత పూజతో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఆడపడుచుల బతుకమ్మ, దాండియా వీక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి పిల్లలకి తెలియచేయాలని లక్ష్యంతో వారు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మలను పేర్చి ప్రతి ఆడపడుచులకు నిర్వాహకులు బహుమతులు ప్రధానం చేసారు. బతుకమ్మ వేడుకలకు సుమారు 250 మంది హాజరయ్యారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)