Namaste NRI

ముందు మీరు అంతం కాకుండా జాగ్రత్త పడండి : ఇరాన్‌ ఘాటు హెచ్చరిక

అగ్రరాజ్యం అమెరికాపై ఇరాన్‌ ధిక్కార స్వరం మరింత పెంచింది. ఇరాన్‌ కొత్త సుప్రీం మొజ్తబా ఖమేనీ ప్రశాంతంగా జీవిస్తారన్న నమ్మకం తనకు లేదని, తన నియామకం పట్ల ఆయన సంతోషంగా లేరని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. మీ వట్టి బెదిరింపులకు ఇరాన్‌ భయపడదు. మీ కన్నా గొప్ప నేతలే ఇరాన్‌ దేశాన్ని ఏమీ చేయలేక పోయారు. ముందు మీరు అంతం కాకుండా జాగ్రత్త పడండి అంటూ ఇరాన్‌ సెక్యూరిటీ చీఫ్‌ అలీ లారిజాని హెచ్చరించారు.

కాగా, ఇరాన్‌ తాజా హెచ్చరికలతో ఇరాన్‌ నుంచి ట్రంప్‌ ప్రాణాలకు ముప్పు ఉందన్న విషయం మరోసారి ప్రచారంలోకి వచ్చింది. ఇరాన్‌,ట్రంప్‌ను హత్య చేయడానికి లక్ష్యంగా చేసుకుందని, అతని ప్రాణానికి ముప్పు ఉందని, ఇప్పటికే పలు బృందాలు ఆ పనిపై దేశంలో సంచరిస్తున్నాయని ఆ దేశ జాతీయ భద్రతా అధికారులు ట్రంప్‌ యంత్రాంగాన్ని హెచ్చరించారు.

Social Share Spread Message

Latest News