తమిళ స్టార్ హీరో దలపతి విజయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తుపాకి చిత్రం నుంచి ఆయనకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడిరది. అప్పటి నుంచి ఆయన నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలై మంచి విజయాలను సాదిస్తున్నాయి. లేటెస్ట్గా ఆయన నటించిన బీస్ట్ సినిమా విడుదల తేదీ ఖరారైంది. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. సన్ పిక్చర్స్ నిర్మించింది. పూజా హెగ్డే కథానాయిక. తమిళంలోనే రూపొందిన ఈ సినిమా తెలుగుతోపాటు పలు భాషల్లో విడుదలవుతోంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన అరబిక్ కుత్తూ సాంగ్ యూట్యూబ్‌లో 21 కోట్ల మంది వీక్షించారు. సౌత్‌లోనే ఫాస్టెస్ట్ వ్యూవుడ్ లిరికల్ సాంగ్‌గా అరబిక్ కత్తూ రికార్డు సృష్టించింది. లేటెస్ట్గా విడుదలైన జాలీ ఓ జుంఖానా సాంగ్ కూడా రికార్డు వ్యూస్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ చిత్రాన్ని తెలుగులో దిల్‌రాజు, ఏషియన్ నారంగ్, సురేష్ బాబుతో కలిసి రిలీజ్ చేస్తున్నాడు. ఏప్రిల్ 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)