కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం బెదురులంక 2012. ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ( బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. క్లాక్స్ దర్శకుడు. ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరిపి జనవరి మొదటి వారంలో చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. కార్తికేయ, నేహా శెట్టి మధ్య వచ్చే ప్రేమ సన్నిశేశాలు ఆకట్టుకుంటాయి. కథలోని మిగతా పాత్రలు వినోదాన్ని పంచుతాయి అన్నారు. నిర్మాత మాట్లాడుతూ అందరినీ నవ్వించే కొత్త తరహా ప్రయత్నమిది అన్నారు. యుగాంతం ప్రచారం నేపథ్యంలో సాగే కథ ఇది. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం : మణిశర్మ.