కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా బెదురులంక 2012. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. ఈ సినిమాతో క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ ట్రైలర్ చాలా బాగుంది. కథలో కొత్తదనం వుందనిపిస్తుంది.కార్తికేయ కొత్త కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తారు. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచలోకి తీసుకువెళ్తుంది. గోదావరి నేపథ్యంలో సినిమాలకు ఇదొక బెంచ్‌మార్క్ సెట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని లంక గ్రామాల్లో ఓ గ్రామమైన బెదురులంకలో జరిగే కథ ఇది. యుగాంతం పేరుతో కొందరు మోసగాళ్లు ప్రజలను భయపెట్టి దేవుడి పేరుతో దోపిడి చేస్తుంటే వారిని కాపాడానికి శివశంకర వరప్రసాద్ (హీరో) ఏం చేశాడు అనేది కథ. తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది . ట్రైలర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమా ఆగస్టు 25న చిత్రం విడుదల కానుంది.
