కోలీవుడ్ యాక్టర్ విజయ్ ఆంటోనీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది బిచ్చగాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం బిచ్చగాడు 2 లో నటిస్తున్నాడు. కావ్య థాపర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దుబాయ్ నుండి మాస్ బిచ్చగాడిని చూడాలనుకుంటున్నారా? ఏప్రిల్ 14న మీ సమీపంలోని థియేటర్లను సందర్శించండి అంటూ విడుదల తేదీ అప్‌డేట్ అందరితో పంచుకున్నాడు విజయ్ ఆంటోని.
ఇప్పటికే విడుదలైన బిచ్చగాడు 2 థీమ్ సాంగ్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. విజయ్ ఆంటోనీ సినిమాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బిచ్చగాడు 2 శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను స్టార్ నెట్‌వర్క్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్టు ఇప్పటికే ఇండస్ట్రీ సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. బిచ్చగాడు 2 చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ బ్యానర్పై ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. తెలుగు,తమిళంతోపాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది.