Namaste NRI

కంచర్ల ప్రారంభం

ఉపేంద్ర హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా కంచర్ల. మీనాక్షి జైస్వాల్‌, ప్రణీత కథానాయికలు.  బాహుబలి ప్రభాకర్‌  కీలక పాత్రలో కనిపించనున్నారు. కె.అచ్యుతరావు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. రెడ్డెం యాదవ్‌కుమార్‌ దర్శకుడు. ఈ చిత్ర షూటింగ్‌ విశాఖ పట్నంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. చిత్ర సమర్పకులు కె.అచ్చుతరావు క్లాప్‌నిచ్చి షూటింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు యాదకుమార్‌ మాట్లాడుతూ యువకులు రాజకీయాల్కోకి రావాలని, సేవా ధృక్పథంతో పనిచేయాలనే సందేశాన్నిచ్చే చిత్రమిది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమాను రూపొందిస్తున్నాం. తొలి షెడ్యూల్‌ని వైజాగ్‌లోనే చిత్రీకరిస్తాం. తర్వలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్‌, గుణశేఖర్‌, క్యాలు జనార్థన్‌ తదితరులు పాల్గొన్నారు.

…………..

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events