Namaste NRI

ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం :  సునాక్‌

ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం మరోపక్క ఇద్దరు చిన్న పిల్లల కు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ పేర్కొన్నారు.  ఈ సందర్భంగా సునాక్‌ మాట్లాడుతూ  తన కుమారైలైన కీస్ణ, అనౌష్క లపై దృష్టి సారించడానికి తగినంత సమయం తనకు దొరకడం లేదంటూ ఆందోళనకు గురవుతు న్నట్లు తెలిపారు. వాళ్లే  నా ప్రపంచం అనుకునే ఇద్దరు కుమార్తెలు నాకున్నారు. ఓ మంచి తండ్రిగా ఉండ టం, సమర్థంగా విధులు నిర్వహించడంలో సమన్వయం సాధించడం చాలా కష్టం అని అన్నారు.  ప్రధానిగా విధి నిర్వహణకు ప్రాధా న్యం ఇవ్వాలి. ఎందుకంటే అతి అత్యంత ముఖ్యమైనది. యావత్తు దేశం తరపున కర్తవ్య నిర్వహణ. దీంతో నా కుమార్తెలతో ఓ తండ్రిగా గడపాల్సిన సమయాన్ని కేటాయించలేకపోతున్నా. ఇది పెద్ద సవాలే. పనుల సర్దు బాటు కారణంగా కొన్ని బాంధవ్యాలను కోల్పోతున్నాను. ఇది చాలా కష్టమైనదే. విద్యుక్త ధర్మమంటే అలాగే ఉంటుంది అని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events