Namaste NRI

సింగపూర్‌లో ఘంటసాల శతజయంతి ఉత్సవాలు

సింగపూర్‌ లో డిసెంబర్ 4న   అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు శ్రీ సాంస్కృతిక కళాసారథి  సింగపూర్,  వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా,  వంశీ ఇంటర్నేషనల్  ఇండియా,  ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శుభోదయం గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భారతదేశం నుంచి వంశీ అధ్యక్షులు డాక్టర్ వంశీ రామరాజు,  శుభోదయం గ్రూప్ చైర్మన్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ కలపటపు,  ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్,  చంద్రతేజ,  సురేఖ మూర్తి వంటి ప్రముఖ నేపద్య గాయనీ గాయకులు,  హాంకాంగ్ నుంచి జయ పీసపాటి,  వాద్య కళాకారులు,  తదితర అతిథులు హాజరు కానున్నారు.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు  అని శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు ఓ ప్రకటనలో తెలిపారు.

                భారతదేశం నుండి వస్తున్న ప్రముఖ గాయని గాయకులచే ప్రత్యేక సంగీత విభావరితో పాటు శుభోదయం ఆధ్వర్యంలో ఘంటసాల ది గ్రేట్  బయోపిక్ ట్రైలర్ ఆవిష్కరణ, వంగూరి ఫౌండేషన్ వారి  మన ఘంటసాలః పుస్తకావిష్కరణ కార్యక్రమాలు అదనపు ఆకర్షణలుగా నిలవబోతున్నాయని చెప్పారు. రాధిక మంగిపూడి ఈ కార్యక్రమానికి ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరిస్తుండగా, సింగపూర్ గాయనీ గాయకులు అలనాటి పాటలను పాడి ఘంటసాలకు నివాళులర్పించనున్నారు. సింగపూర్లో   Punggol లోని GIIS  ప్రాంగణంలో సుమారు 5 గంటలపాటు జరగనున్న ఈ కార్యక్రమానికి సింగపూర్‌లోని తెలుగు ప్రజలు అందరూ హాజరు కావాలని నిర్వాహక బృందం సభ్యులు పిలుపునిచ్చారు.

గత సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన ప్రారంభించి, 366 రోజుల పాటు నిర్విరామంగా అంతర్జాల మాధ్యమంలో నిర్వహిస్తూవస్తున్న ఘంటసాల స్వరరాగ మహాయాగం  కార్యక్రమం యొక్క సమాపణోత్సవం, సింగపూర్‌లో ఘంటసాల శతజయంతి రోజున నిర్వహించనున్నామాని  తెలిపారు.  

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events