Skip to main content

Namaste NRI

టైసన్ నాయుడుగా వస్తున్న బెల్లంకొండ సాయి

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి టైసన్‌ నాయుడు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 14రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ జన్మదినం సందర్భంగా టైటిల్‌ ప్రకటనతో పాటు ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో హీరో సాయిశ్రీనివాస్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా పరిచయమయ్యారు. బాక్సింగ్‌ రింగ్‌లో ప్రత్యర్థిని మట్టికరిపిస్తూ యాక్షన్‌ మోడ్‌లో కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌టైసన్‌ ఫొటో ప్రధానాకర్షణగా నిలిచింది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌ను పూర్తి యాక్షన్‌ అవతారంలో చూస్తారని, సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ముఖేష్‌ జ్ఞానేష్‌, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, రచన-దర్శకత్వం: సాగర్‌ కె చంద్ర.

Social Share Spread Message

Latest News