Namaste NRI

బాలీవుడ్‌లో బెల్లంకొండ  స్టార్‌ అవుతాడు 

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ నటించిన బాలీవుడ్‌ సినిమా ఛత్రపతి. వీవీ వినాయక్‌ దర్శకుడు. పెన్‌ స్టూడియోస్‌ పతాకంపై ధవల్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతిలాల్‌ గడా నిర్మించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మాత బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ మా అబ్బాయి శ్రీనివాస్‌కు యాక్షన్‌ హీరో ఇమేజ్‌ ఉంది. దాంతో ఈ సబ్జెక్ట్‌ బాగుంటుందని సెలెక్ట్‌ చేసుకున్నాం. ఫైట్స్‌, మదర్‌ సెంటిమెంట్‌, శ్రీనివాస్‌ పర్మార్మెన్స్‌ ఆకట్టుకుంటాయి. మా అబ్బాయితో బాలీవుడ్‌ నిర్మాతలు 60 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి హిందీ సినిమా చేయడం గర్వంగా ఉంది. మరో రెండు బాలీవుడ్‌ చిత్రాలను నిర్మించేందుకు కూడా జయంతి లాల్‌ గడా ముందుకొచ్చారు అని చెప్పారు. దర్శకుడు వీవీ వినాయక్‌ మాట్లాడుతూ ఉత్తరాది ప్రచార కార్యక్రమాల్లో బెల్లంకొండ శ్రీనివాస్‌, హీరోయిన్‌ ఉన్నారు. అక్కడ ప్రేక్షకుల నుంచి వారికి మంచి ఆదరణ లభిస్తున్నది. ఒరిజినల్‌ సినిమాను చెడగొట్టకుండా సాధ్యమైనంత ఆకట్టుకునేలా రూపొందించాలని ప్రయత్నం చేశాను. నటుడిగా శ్రీనివాస్‌ పరిణితి చెందాడు. ఆయన పర్మార్మెన్స్‌ చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఇప్పటి పిల్లలకు ఛత్రపతి సినిమా తెలియదు. పెద్ద వాళ్లు ఎలా ఉందో చూస్తారని ఆశిస్తున్నాం. బాలీవుడ్‌లో హీరోగా శ్రీనివాస్‌ పేరు తెచ్చుకుంటాడు  అన్నారు. ఈ సినిమా ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events