టెస్లా అధినేత, ట్వీటర్ ఓనర్ ఎలాన్ మస్క్ ప్రపంచ అత్యంత ధనవంతుల్లో తన అగ్రస్థానాన్ని కోల్పోయారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలీనియర్స్ లిస్టు ప్రకారం.. మొదటి ప్లేస్‌లో ఉన్న మస్క్ స్థానంలోకి లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ మాతృసంస్థ ఎల్వీఎంహెచ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ అర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ దూసుకొచ్చారు. తర్వాత ఇది మారుతూ వచ్చింది. తన ఎలక్ట్రిక్ కారు కంపెనీ షేర్లు పడిపోవడం, ట్విటర్ కొనుగోలుకు 44 బిలియన్ డాలర్ల డీల్ కారణంగా ఆయన అగ్రస్థానం టైటిల్‌ను కోల్పోయారని ఫోర్బ్స్ తెలిపింది. 2021, సెప్టెంబర్ నుంచి ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో మస్క్ మొదటిస్థానంలో ఉన్నారు.