Skip to main content

Namaste NRI

ఎలాన్‌ మస్క్‌కు షాక్ ఇచ్చిన బెర్నార్డ్‌

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో లగ్జరీ వస్తువుల కంపెనీ ఎల్‌వీఎంహెచ్‌ చైర్మన్‌, సీఈవో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ (74) మరోసారి మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న స్పేస్‌ ఎక్స్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని బెర్నార్డ్‌ దక్కించుకున్నట్టు ఫోర్బ్స్‌ వెల్లడించింది. ఆర్నాల్ట్‌, ఆయన కుటుంబం ఆస్తి ఈ ఏడాది 23.6 బిలియన్‌ డాలర్లు పెరిగి 207.8 బిలియన్‌ డాలర్లుకు చేరుకో గా, మస్క్‌ సంపద 204.5 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. బెర్నార్డ్‌ మొదటిసారి 2022లో కూడా మస్క్‌ను అధిగమించి తొలి స్థానాన్ని దక్కించుకున్నారు.

Social Share Spread Message

Latest News