Namaste NRI

సెన్సార్ పూర్తి చేసుకున్న దేశం కోసం భగత్ సింగ్

రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం  దేశం కోసం భగత్ సింగ్. నాగ‌ల‌క్ష్మి ప్రొడ‌క్ష‌న్స్ అధినేత రవీంద్ర గోపాల  ఈ  చిత్రాన్ని నిర్మించారు. ర‌వీంద్రజి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు సినీ చరిత్రలో ఎవరూ ఇంతవరకు చేయ‌న‌టువంటి దేశ స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల చరిత్రను ఆధారంగా చేసుకుని అద్భుతంగా తెర‌కెక్కించిన‌ చిత్రం.   ఈ చిత్రంలో  సూర్య, జీవా, ప్రసాద్ బాబు, అశోక్ కుమార్, సుధ నటించగా, మిగిలిన తారాగణం పాత కొత్త  నటీనటుల కలయికలతో నిర్మించారు.  ఈ చిత్రానికి  సాంకేతిక వర్గం:  కెమెరాః సి. వి. ఆనంద్, సంగీతం ప్ర‌మోద్ కుమార్‌, మాట‌లుః సూర్యప్ర‌కాష్,రవీంద్ర గోపాల, పాట‌లుః ర‌వీంద్ర గోపాల‌, ఎడిటింగ్ః రామారావు, కోడైరెక్ట‌ర్ః రామారావు, స్ర్కీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం, నిర్మాతః ర‌వీంద్ర‌జి. బ్యాన‌ర్ః నాగ‌ల‌క్ష్మి ప్రొడ‌క్ష‌న్స్

Social Share Spread Message

Latest News