Namaste NRI

కీలక షెడ్యూల్ పూర్తి చేసిన భగవంత్ కేసరి

నంద‌మూరి బాల‌కృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం భగవంత్ కేసరి.  ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది.  మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఎన్‌బీకే 108  ప్రాజెక్ట్‌గా వస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్  కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. తాజాగా ఈ సినిమా అప్‌డేట్ వచ్చింది. అర్జున్ రాంపాల్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది.

ఇది నా సినిమా భ‌గ‌వంత్‌కేస‌రి షూటింగ్‌ పూర్తయిన సమయం. నా తొలి తెలుగు సినిమా షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను. షూటింగ్‌ పూర్తి స్థాయిలో జరిగిందని,  నేనిప్పుడు చాలా నిశ్చింతగా చెప్పగలను. నా పెద్ద అన్నయ్య బాలకృష్ణ శక్తి లేకుండా ఇదంతా సాధ్యం కాదు. బ్రో మీ అద్భుతమైన శక్తికి, ప్రేమకు ధన్యవాదాలు. లవ్ యూ. నా ప్రియమైన తమ్ముడు అనిల్ రావిపూడికి ధన్యవాదాలు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా బాలయ్యను అర్జున్‌ రాంపాల్ ఆత్మీయంగా హగ్‌ చేసుకున్నాడు. భగవంత్‌ కేసరి టీంకు గుడ్‌బై. 2023 అక్టోబర్, 19 థియేటర్లలో కలుద్దాం  అని అన్నారు. ఈ చిత్రానికి సి రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్‌ థమన్‌ మరోసారి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events