బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ విశేషాలను తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. 12 భారీ సెట్లలో, దేశంలోని అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపినట్లు మేకర్స్ తెలిపారు. కలిసి మాట్లాడతా అన్నా కదా.. అంతలోనే మందిని పంపాలా’ బ్రో ఐ డోంట్ కేర్ అంటూ వీడియోలో బాలకృష్ణ చెప్పిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. తెలంగాణ యాసలో బాలకృష్ణ సంభాషణలు హైలైట్‌గా నిలుస్తాయి. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ సినిమా అందరిని మెప్పిస్తుంది అని చిత్రబృందం పేర్కొంది. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: సి.రామ్‌ప్రసాద్, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.














