నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. సంగీతం ఎస్ థమన్. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తుండగా, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్నాడు. తాజాగా ట్రైలర్ అప్‌డేట్ అందించి ఫుల్ ఖుషీ అయ్యేలా చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ సారి మీ ఊహలకు మించి, అంటూ ట్రైలర్‌ను అక్టోబర్ 8న లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ అలరించబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన గ్లింప్స్, టీజర్ క్లారిటీ ఇచ్చేశాడు. భగవంత్ కేసరి అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.














